top of page

అందరికి ఎయిర్టెల్ 5 జిబి డేటా ఉచితం గా ఇస్తుంది అని ఉదయం నుండి న్యూస్ హాల్ చల్ చేస్తుంది.అది నిజమేనా


వరల్డ్ టెక్ నాలెడ్జి దీని గురించి వివరణ ఇస్తుంది. అది వాస్తవంగా నిజం కాదు.దానికి మనం ఒక సాహసం లాంటిది డబ్బులు రూపంలో చెల్లించుకోవాలి. అది ఎలానో చూద్దాం... * మొదట మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి "MY AIRTEL"యాప్ ను మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడనుండి సినిమా చూపిస్తా మామ అన్నట్టు ఉంటుంది. * అక్కడ మొదట మన ఎయిర్టెల్ నెంబర్ అడుగుతుంది,మనం ఎంటర్ చెయ్యగానే మన మొబైల్ కి ఒక OTP వస్తుంది దానిని యాప్ లో ఎంటర్ చెయ్యగానే,అక్కడ సెప్టెంబర్ ఆఫర్స్ అని ఉంటుంది అది నొక్కండి. * తరువాత మొదట Recharg and earn అని ఉంటుంది.అంటే మీరు దానిని మీరు నొక్కి రూ.200 లేదా అంతకన్నా ఎక్కువ recharg చేసుకొంటే అప్పుడు 1 జిబి వస్తుంది. * మల్లి wynk music యాప్ ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి 10 సాంగ్స్ ను మీరు వింటే అప్పుడు మీకు ఇంకో 500 జిబి ఇస్తారు. * తరువాత రూ.100 లోడ్ చేసుకొంటే మొబైల్ లోకి అప్పుడు మల్లి ఇంకో 500 జిబి వస్తుంది. * ఒక గేమ్ ను డౌన్లోడ్ చేసుకొని ఆ గేమ్ లోని టాస్క్ లు చేస్తే అప్పుడు ఇంకో 500 జిబి వస్తుంది. ఈ విదంగా watch jazbaa, Recharg for your friend, download an album, send money, download 3 games, refer and earn అని మనకు సినిమా చూపిస్తారు.ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకొంటే మన జేబులకు చిల్లు ఉంటుంది.

పోనీ ఇంత చేసుకొని ఆ 5 జిబి పొందాక.ఆ 5 జిబి ఎప్పుడు వాడుకోవాలో తెలుసా రాత్రి 1 గం// నుండి ఉదయం 6 గం// లోపు వాడుకోవాలి.

విన్నారుగా ఎయిర్టెల్ 5 జిబి ఫ్రీ 4జి ఇంటర్నెట్.ఇంక మిరే చెప్పండి ఈ ఆఫర్ ఫ్రీనో కాదో.

youtube వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరియు

facebook పేజి ని like చేసి లేటెస్ట్ పోస్ట్స్ పొందండి.


Recent Posts
bottom of page