రిలయన్స్ జియో సిమ్ MNP ఇస్తుంది.మీరు వాడుతున్న నెంబర్ పైనే రిలయన్స్ జియో సేవలు పొందటం ఎలానో చూద్దాం.
- Avinash Maddiboina

- Sep 3, 2016
- 1 min read

రిలయన్స్ జియో వాయిస్ కాల్స్ లైఫ్ టైం ఫ్రీ తో పాటే మీరు వాడుతున్న నెంబర్ పైనే జియో సేవలు పొందొచ్చు.రిలయన్స్ జియో ప్లాన్ ప్రబంజనం జనాల్లోకి వెళ్ళింది.ఇప్పుడు అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకొంటున్నారు.ఇది ఇతర కంపెనీలకు మాత్రం కునుకు లేకుండా చేస్తుంది.ఇది టెలికాం రంగంలో ఒక విప్లవం అని చెప్పాలి.ఎప్పుడోచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అనే మహేష్ మాటలు గుర్తొచ్చేలా రిలయన్స్ జియో ప్రబంజనం సృష్టింస్తుంది.
రిలయన్స్ జియో సిమ్ మీరు వాడుతున్న నెంబర్ పై పొందాలంటే ఇలా ఫాలో అవ్వండి:
మొదట మీరు వాడుతున్న నెంబర్ పై PORT అని టైప్ చేసి 1900 కి మెసేజ్ పంపాలి.అప్పుడు 1901 నుండి మీ మొబైల్ కి Unique Porting Code వస్తుంది.మీరు మెసేజ్ వచ్చిన 15 రోజులలోపు మీ దగ్గర లో ఉన్న Reliance Mobile Store లేక retailer దగ్గరకు వెళ్లి కస్టమర్ అప్లికేషన్ ఫాం (CAF) లో మీ Unique Porting Code రాసి,మరియు కావలసిన documents ను అంటే అడ్రస్ ప్రూఫ్ ,గుర్తింపు కార్డు,ఫోటో ను వాళ్ళకు పొందుపరచాలి మరియు వాళ్ళకు రూ.19 చెల్లించాలి.అప్పుడు వాళ్ళు మీకు రిలయన్స్ జియో సిమ్ ఇస్తారు.ఈ సిమ్ యాక్టివ్ అయ్యాక మిరువాడే సిమ్ నిలిపివేయబడుతుంది.అప్పుడు రిలయన్స్ జియో సిమ్ మీ మొబైల్ లో వేసుకొని వాడుకోవచ్చు.
రిలయన్స్ జియో సిమ్ MNP యాక్టివ్ కావటానికి 7 రోజులు పడుతుంది.ఈ 7 రోజులు పాత నెంబర్ తో వాడుకోవచ్చు.
























Comments