top of page

ఇక డ్రైవింగ్ లైసెన్సు ని మొబైల్ app లో చూపిస్తే సరిపోతుంది!!!! ముందు మీ ఫోన్ నెంబర్ ని ఆదార్ కి లింక

  • Writer: Avinash Maddiboina
    Avinash Maddiboina
  • Sep 9, 2016
  • 1 min read

మీ ఆదార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోన్నారా లేదా సరిచూసుకోండి.ఒకవేళ లింక్ చేసి లేకుంటే ముందు మీ దగ్గరలోవున్న ఆదార్ సెంటర్ కి వెళ్లి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి.ఎందుకంటే భారత ప్రభుత్వం DigiLocker అనే app ను ప్రవేసపెట్టింది.ఇందులో signing up అవ్వాలంటే మీ మొబైల్ ఆదార్ కార్డు కి అనుసందానం చేసి ఉండాలి.మీ ఆదార్ కార్డు అప్లికేషన్ లో ఇవ్వగానే మీ మొబైల్ కి OTP(one-time password) వస్తుంది.ఆ OTP ని అప్లికేషన్ లో టైప్ చేస్తే DigiLocker account క్రియేట్ అవుతుంది.మీ మొబైల్ నెంబర్ ఆదార్ కార్డు కి అనుసంధానం లేకుంటే ఆ OTP రాదు.

అసలు DigiLocker వల్ల ఉపయోగం ఏంటి ?

అనుకొంటున్నారా,DigiLocker వల్ల చాల ఉపయోగం ఉంది.మన సర్టిఫికెట్స్,డ్రైవింగ్ లైసెన్స్,ఇంకా ఏ documents అయిన ఇందులో స్టోరేజి చేసుకోవచ్చు.ఆ స్టోరేజి చేసుకొన్న documents ని మీరు ఎక్కడైనా చూపించవచ్చు కాగితాలతో పనిలేకుండా.మీ బైక్ ని పోలీసులు ఎక్కడైనా ఆపినప్పుడు మీరు మీ మొబైల్ ఆన్ చేసి DigiLocker లో ఉన్న డ్రైవింగ్ లైసెన్సు మరియు బైక్ Registration నెంబర్ ను వాళ్ళకు చూపిస్తే సరిపోతుంది.ఇంకా మీరు చదువుకొన్న సర్టిఫికెట్స్ ను కూడా ఎక్కడైనా అవసరం అయితే ఈ యాప్ లో చూపించవచ్చు.చాల బాగుంది కదా ఇది.


 
 
 

Comments


Recent Posts
bottom of page