online లో మనీ సంపాదించటం నిజమేనా ? అంతా మోసమేనా ? world tech knowledge మీకు పూర్తి సమాచారం ఇస్తుంది

తెలుసుకోండి online మోసాల బారిన పడకుండా జాగర్తగా ఉండండి.
ఈ మధ్య online లో మోసాలు బాగా పెరిగాయి.ముఖ్యంగా నిరుద్యోగులు బాగా మోసపోతున్నారు.వాళ్ళు టార్గెట్ కూడా నిరుద్వోగులపైనే నాకు చాలామంది మెయిల్స్ పంపారు online లో మనీ ఎలా సంపాదించాలి అని.కొంతమంది ఒక సైట్ లో మనీ పెట్టాం అది మంచి సైటా కాదా అని.
ఇక్కడ నేను పూర్తిగా చెప్తున్నాను,online లో మనీ సంపాదించవచ్చు.కానీ కొన్ని మార్గాలలో మాత్రమే.చాల వరకు అన్ని మోసపూరితమైన సైట్స్ ఉంటాయి. online లో చేయకూడనవి:
కొన్ని సైట్స్ యాడ్స్ క్లిక్ చెయ్యండి మనీ ఇస్తాము-ఇలాంటి సైట్స్ అన్ని 100% మోసపురితమే.ఇలాంటివి కొన్ని రోజులు నడిపి స్కాం చేస్తారు.
మీ సైట్ కి మెయిల్ పంపుతాం ఓపెన్ చేయండి మనీ ఇస్తాము-ఇవి కూడా 100% మోసపురితమే.
sms లు పంపమంటారు ఇది కూడా మోసమే.రోజుకి 100 messages పంపమంటారు.
మీరు 325 కట్టండి కోటి రూపాయలు సంపాదించండి అని అంటారు,మనవాళ్ళు కొంత మొత్తమే కదా అని చెల్లిస్తారు.ఆ తరువాత వాళ్ళు అడ్రస్ ఉండరు.
ఇంకా చాల మార్గాలలో మోసాలు ఉంటాయి ... మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి online మనీ కట్టమంటే అది 100% మోసమే. నేను కింద online లో మనీ సంపాదించే మార్గాలు చెప్తాను.అవి తప్ప అన్ని మోసపురితమే.
online లో మనీ సంపాదించే మార్గాలు:
online లో మనీ సంపాదించాలంటే మొదట Google AdSense నుండి బ్లాగ్ లో మరియు youtube లో మనీ సంపాదించవచ్చు.అది ఎలాగంటే మీకు ఇస్తామున్న విషయం ఫై మీరు ఒక బ్లాగ్ తయారు చేసుకోవాలి ,దానికి blogger,wordpress,wix...ఇలాంటి వాటిల్లో మీరు బ్లాగ్ లేదా వెబ్ సైట్ తయారు చేసి ఆ వెబ్ సైట్ ట్రాఫిక్ పెంచాలి,అలా చెయ్యాలంటే సైట్ ని గూగుల్ లో index చేసి SEO చేసి మన వెబ్ సైట్ కి ట్రాఫిక్ పెంచి Google AdSense కి అప్ప్లై చేసుకొంటే వాళ్ళు మన సైట్ ని చూసి వాళ్ళు మన సైట్ లో adds వేసుకొని మనకి మనీ చెల్లిస్తారు.
తరువాత youtube లో ఛానల్ create చేసుకొని ఇదికూడా మీకు నచ్చిన విషయం ఫై వీడియోలు తయారు చేసి మీ వీడియోస్ ను మొనటైజ్ చేసి AdSense నుండి మనీ సంపాదించవచ్చు ,ఈ రొండు మార్గాలలో ఒక్కొకళ్ళు కొన్ని లక్షలు సంపాదించేవారు ఉన్నారు.
తరువాత Affliate మార్కెట్ నుండి సంపాదించవచ్చు.ఇది ఎలాగంటే మన వెబ్సైట్ లో లేదా బ్లాగ్ లో amazan,flipkart,snapdeal,ebay...etc సైట్ Affliate గా చేరి వాళ్ళ ప్రొడక్ట్స్ మన సైట్స్ ఫై పెట్టుకొంటే ఎవరైనా మన సైట్ లో ప్రొడక్ట్స్ కొంటె మనకు వాళ్ళు కొంత మనీ మనకు ఇస్తారు.దిని కోవకు చెందినదే డిజిటల్ మార్కెట్.
ఇంకా freelancer ద్వార మనీ సంపాదించవచ్చు.ఇది ఎలాగంటే మనకు స్కిల్ ఉండాలి ,మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.అలా freelancer లో అప్ప్లై చేసుకొని online లో ప్రాజెక్ట్స్ తీసుకోని మనీ సంపాదించవచ్చు.ఇలాకూడా లక్షల సంపాదించేవారు ఉన్నారు.
నాకు తెలిసినంత వరకు ఇవి తప్ప అన్ని మోసపురితమైనవే.దయచేసి online లో మనీ ఎవరు కట్టకండి.మనీ కట్టమంటే అది మోసమే. world tech knowledge ఎవరు online లో ఎవరు మోసపుకూడదు అని ఇది రాయటం జరిగింది.
online లో డబ్బులు ఎలా సంపాదించాలి అని ఒక్కొక్క దానిపై క్లుప్తంగా నేను ఎప్పటికప్పుడు ఫ్యూచర్ లో రాస్తాను ...టచ్ లో ఉండండి.....మీరు ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి ......