మీ జిమెయిల్ లో ఇన్బాక్స్ లో పేరుకుపోయిన అవసరం లేని మెయిల్స్ ను సులభం గా తీసివేయండి ఇలా ...

మనకు చాల మెయిల్స్ వస్తుంటాయి.అందులో మనకు అవసరం అయిన వాటికంటే అవసరం లేనివే ఎక్కువ వస్తుంటాయి.మనం కొన్ని సైటులో కి వెళ్లి ఈమెయిలు ఇస్తుంటాము.అప్పటినుండి మనము వద్దన్నా అవి వస్తుంటాయి. మనము వాటిని unsubscribe చెయ్యము.ఇంక కొన్ని రోజులకి చూసుకొంటే వేలు,లక్షలు ఇన్బాక్స్ లో ఉంటాయి.
వాటిని ఒక్కొక్కటి తిసివేయాలంటే చాలారోజులు పడుతుంది,విసుగు వస్తుంది.దానికి నేను ఒక పరిష్కారం చెప్తాను.
జిమెయిల్ లో దానికోసం ఇన్బాక్స్ ఓపెన్ చేసాక మీరు తిసివేయల్సిన మెయిల్ ఫై టిక్ పెట్టండి,తరువాత more ఆప్షన్ లోకి వెళ్లి "filter messages like these" ను నొక్కండి,అప్పుడు దానిని ఓకే చెయ్యండి.అప్పుడు అలాంటి మెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి.వాటిని all select ఫై క్లిక్ చేసి మొత్తం డిలీట్ చెయ్యండి.మల్లి మిగిలిన వాటిపై కూడా అంతే చెయ్యండి.చాల సులభంగా తక్కువ టైం లో అవసరం లేని అన్ని మెయిల్స్ ను తిసివేయ్యోచ్చు.