top of page

జిన్నోవ్ సంస్థ అధ్యయనంలో వెలువడిన ఆటోమేషన్ ప్రభావం...ఐటి ఉద్యోగులకు చేదు వార్త...


నైపుణ్యాలు లేకపోతె ఇంక ఐటి ఉద్యోగాలు కష్టమే.అవును జిన్నోవ్ సంస్థ అధ్యయనంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది అని,దీని ప్రభావం తో రాబోయే రోజుల్లో ఐటి ఉద్యోగాలు భారీ గా కోత తప్పదన అధ్యయనం చెప్తుంది.ఇతర దేశాల్లో ఈ రంగం దూసుకుపోతుంది.అభివృద్ధి చెందుతున్న మన ఇండియా లో కూడా ఈ ఆటోమేషన్ ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలైంది.

దీని వల్ల అన్ని రంగాలకంటే ఐటి రంగం ఫై ప్రభావం తీవ్రంగా ఉంటుంది.2021 కాళ్ళ దాదాపు 70 వేలమంది దీని ప్రభావం వల్ల నిరుద్యోగులు అవుతారని అంచనా.

అసలు " ఆటోమేషన్ " అంటే ఏమిటి ? ఆటోమేషన్ అంటే మనుషులతో పని లేకుండా మెషిన్ లతో పని చేయించుకోవటం.అంటే రోబో లాగా.

నైపుణ్యం లేని ఐటి ఉద్యోగులుకు ఇది చేదు వార్త.ఈ ఐ వోటి టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు కోత పడిన కొత్త ఉద్యోగాలు వస్తాయి అని నిపుణులు అంటున్నారు.

అంతే కాదు భవిష్యత్తులో ప్రోడక్ట్ మనేజేర్స్,రోబో కో-ఆర్డినేటర్ లు,ఇండస్ట్రియల్ ప్రోగ్రామెర్స్,నెట్వర్క్ ఇంజనీర్స్ వంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది అని జిన్నోవ్ సంస్థ అధ్యయనంలో తెలిసింది.ఇప్పుడు ఐ వోటి సర్వీసెస్ మార్కెట్ 40 శాతం ఉందని,2021 కి ఇది 44 శాతం చేరుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.


 
Recent Posts
bottom of page