top of page

ఇక మనకి ఏది ఫ్రీ గా దొరకదు ఇంటర్నెట్ లో తొందరలో !!!!!


అవునండి మనకి ఇంక ఏది ఇంటర్నెట్ లో ఫ్రీ గా దొరకదు.కొత్త కొత్త టెక్నాలజీ లతో ఇంటింటికి ఇంటర్నెట్ అందించ బోతున్నారు.

మనం ఇప్పుడు ఏవైనా సాంగ్స్ కావాలన్నా లేక కొన్ని మూవీస్ కావాలన్నా ఇంటర్నెట్ లో ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకొనే వాళ్ళం ,ఇంక కొన్ని రోజులలో ఆ ఆటలు సాగవు.

ఈ మధ్యనే చాల పేరున్న మూవీ డౌన్లోడ్ చేసుకొనే సైట్ ని కోర్ట్ బ్లాక్ చేసింది.ఇప్పటి వరకు ఆ మూవీ డౌన్లోడ్ సాఫ్ట్వేర్ లేని కంప్యూటర్ ఉండదంటే అతిసేయోక్ఖి కాదు.అదేకాదు భవిష్యత్తులో మీకు ఏమి ఫ్రీ గా రాదు.ఇప్పుడు మీరు youtube లో మూవీస్ కూడా మనీ కట్టి చూడాలి ,అలానే సాంగ్స్ కావాలన్నా మనీ పే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.

మనకి అన్ని అలవాటు చేసి దానిని బిజినెస్ చేసుకోవటం ఈ మధ్య నడుస్తుంది అది ఏలనో చెప్తాను.

మనకి చాలామందికి ఒక 6 లేక 7 సంవత్సరాల క్రితం మొబైల్ లో ఇంటర్నెట్ ఉస్ చెయ్యటం తెలియదు.అప్పుడు అన్ని మొబైల్ కంపెనీలు ఇంటర్నెట్ కేవలం 15 నుండి 20 రూపాయలకి 500 MB డేటా ఇచ్చేవారు.కొంచం కొంచం పెంచుకొంటూ అలవాటు చేసి ఇప్పుడు 1 GB ఇంటర్నెట్ కావాలంటే 200 కావాల్సిందే.ఎందుకంటె ఇప్పుడు అందరు మొబైల్ లోఇంటర్నెట్ వాడుతున్నారు . టాక్ టైం అయిపోయిన భాద లేదుగాని డేటా ప్యాక్ లేకపోతె మాత్రం ఏదో కోల్పోయాం అని భావించే విదంగా అయ్యారు .

అదే విదంగా SBI బ్యాంకు కూడా మొదట మొబైల్ బ్యాంకు ఫ్రీ గా అందరికి అలవాటు చేసి ఇప్పుడు అదే మొబైల్ బ్యాంకు సేవలకి ప్రతి transaction కి మనీ వసుల్ చేస్తుంది.

మన తల్లి తండ్రులు తాతలు అందరు పవర్ లేకుండా ఇంట్లో చీకట్లో జీవితాన్ని గడిపారు ,ఇప్పుడు మనకి పవర్ లేకుంటే బ్రతకలేని పరిస్తితి ఉంది .మనకి పవర్ అలవాటు చేసి ఇప్పుడుప్రతి మూడు నెలలకి ఒకసారి పవర్ ఛార్జ్ లు పెంచుతున్నారు .

అదేవిదంగా గ్యాస్,టీవీ........ఎలా చెప్పుకొంటూ పొతే చాల ఉన్నాయి ....

ఏదయినా బిజినెస్ ట్రిక్ ఏంటంటే ముందు ఫ్రీ గా అలవాటు చేయ్యటం ,తరువాత ఇంకా వినియోగదారులు ఎక్కడికి పోతారు లే అని చార్జీలు మోత మోగిస్తున్నారు.

అదేకోవలోకి ఇంటర్నెట్ రాబోతుంది .....మీరు కూడా చార్జీల భాదుడు కి అలవాటు పడండి మరి .....


Recent Posts
bottom of page