top of page

సేల్ఫీ రాజే ....సేల్ఫీ స్టొరీ......


మన వాళ్ళు సేల్ఫీ కోసం ఏమైనా చేస్తున్నారు.ఈ రోజుల్లో చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు సేల్ఫీ గురించి తెలియని వారు సేల్ఫీ దిగని వారు ఉండరు అంటే దాని పాపులారిటీ అలా ఉంది. కొంచం దాని కధ లో కి వెళదాం.

మొట్టమొదట Robert Cornelius అనే అమెరికన్ వ్యక్తి 1839 సంవత్సరం లో సెల్ఫీ దిగాడు.అతను ఆ సెల్ఫీ దిగటానికి చాల ఇబ్బంది పడి మరి దిగాడట,అప్పుడు ఇంత టెక్నోలజి లేదుగా అందుకే అతను ఎలా ఇబ్బంది పడి దిగాడో మనకు ఇప్పుడు అవసరం లేకపోయినా దిగింది మనకు ముఖ్యం. ఇప్పుడు దాని పాపులారిటి మాత్రం ఎవరెస్ట్ ని తాకింది. ఇందులో చాల రకాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం : * పెళ్లి లో దిగే సేల్ఫీ లు * సెలబ్రిటీ సెల్ఫీ లు * పొలిటిషియెన్ సేల్ఫీ లు * గ్రూప్ సేల్ఫీ లు * బార్య,భర్త సేల్ఫీ ఇది రొండు రకాలుగా దిగుతున్నారు

ఒకటి ఫోన్ ని హ్యాండ్ తో పట్టుకొని మరియు సేల్ఫీ స్టిక్ తో దిగుతున్నారు . మరి డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇది ఒక ఫోబియా అని దిన్ని కూడా రోగాల లిస్టు లో చేర్చాలి అంటున్నారు.వాళ్ళు అలా ఎందుకు అంటున్నారు అంటే ఈ మధ్య ఈ సెల్ఫీ ల వళ్ళ చాల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు.మరి ఘోరంగా ట్రైన్ పక్కన,ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీ లు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.

నా అభిప్రాయం ఏంటంటే సేల్ఫీ దిగటం తప్పుకాదు.కాకుంటే పదే పదే దిగాలనిపించటం,ప్రమాదాల జరిగే ప్రదేశాల్లో దిగాలనిపించటం మాత్రం ఇది ఒక ఫోబియనే.కొంచం జాగర్తగా ఉండండి మరి.....


Recent Posts
bottom of page